ఖమ్మంలో సీపీఐ శతవసంతాల వేడుకల సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయాలి: సాబీర్ పాషా

ఖమ్మంలో సీపీఐ శతవసంతాల వేడుకల సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయాలి: సాబీర్ పాషా
గుండాల మండలం జనవరి 5 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి


ఖమ్మం జిల్లాలో జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతవసంతాల వేడుకల సన్నాహక సమావేశాన్ని పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు సమిష్టిగా జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీపీఐ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర ఉందని, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి ప్రజా సమస్యల వరకూ నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ సీపీఐ అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

సీపీఐ పార్టీ చేపడుతున్న ప్రజా ఉద్యమాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కుంజ బుచ్చయ్య, బొమ్మెర్ల లాలయ్య ఆదివారం నాడు జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గారి చేతుల మీదుగా సీపీఐ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు తమను ప్రభావితం చేశాయని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య, నాయకులు వాగబోయిన రమేష్, కొమరం హనుమంతు, ఎస్.కే. షాహిద్ శ్రీనివాస్, సాహెబ్, కుమార్, ఎస్.కే. సమీర్, బచ్చల రామయ్య, లక్ష్మయ్య, షబ్బీర్, నాసిర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727