*69 వ జాతీయ కబడ్డి పోటీలకు 33 జట్లు రిజిస్ట్రేషన్ పూర్తి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటి

69 వ జాతీయ కబడ్డి పోటీలకు 33 జట్లు రిజిస్ట్రేషన్ పూర్తి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
పినపాక:పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ జాతీయ కబడ్డీ పోటీలు జనవరి 7వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించబడు తున్న ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు జాతీయ స్థాయి విద్యా సంస్థల నుంచి భారీ స్పందన లభించిందని ఆయన తెలిపారు.
ఈ పోటీలు అండర్–17 బాలుర విభాగంలో నిర్వహించబడనున్నాయని, మొత్తం 33 జట్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బిహార్, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డియూ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయని వివరించారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ , నవోదయ విద్యాలయ సమితి , సీబీఎస్‌ఈ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, సీఐఎస్‌సీఈ , విద్యాభారతి వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల జట్లు కూడా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రతి జట్టు నుంచి 6 నుంచి 12 మంది క్రీడాకారులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందనుందని కలెక్టర్ తెలిపారు. క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజనం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత, రవాణా ఏర్పాట్లు తదితర అంశాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ జాతీయ క్రీడా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత పెంచేలా సంబంధిత శాఖలు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727