చెకుముకి టాలెంట్ టెస్ట్ లో సత్తా చాటిన ఎక్సలెంట్ విద్యార్థులు

చెకుముకి టాలెంట్ టెస్ట్ లో సత్తా చాటిన ఎక్సలెంట్ విద్యార్థులు
-విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం

పినపాక

పినపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక తెలంగాణ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ పోటీలలో ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలలో మండలంలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో లో ఎక్స్లెంట్ భాష హై స్కూల్ బయ్యారంకు చెందిన విద్యార్థులు త్రీశాంత్, హేమ శ్రీ, శ్రీలేఖ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి ఔరా అనిపించారు. పోటీలో గెలుపొందిన ఎక్సలెంట్ భాష హై స్కూల్ కు చెందిన విద్యార్థులు పినపాక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే .రమణ చేతుల మీదుగా ప్రధమ బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల స్థాయిలో ఇటువంటి చెకుముకి టాలెంట్ టెస్టులను నిర్వహించడం వలన విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించవచ్చని సూచించారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ ల వలన విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించవచ్చని ఈ టెస్టులు నిర్వహించిన జన విజ్ఞాన వేదిక తెలంగాణ నిర్వహుకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.చెకుముకి టాలెంట్ పోటీలలో ప్రథమ బహుమతిని పొంది తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులు యాజమాన్యం గర్వించే విధంగా విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారని ఎక్సలెంట్ భాష హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ప్రశంసించారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వాహకులు జన విజ్ఞాన వేదిక తెలంగాణ పినపాక మండల కన్వీనర్ బి రాంబాబు పోటీ పరీక్షలో గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727