చెకుముకి టాలెంట్ టెస్ట్ విజేతలు వీరే

చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో మెరిసిన జడ్పీహెచ్ఎస్ ఈ బయ్యారం విద్యార్థులు
– విద్యార్థులను అభినందించిన ఎంఈఓ నాగయ్య
పినపాక:పినపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడుల్ల బయ్యారం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం దక్కించుకున్నారు.మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి పలువురు విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో జడ్పీహెచ్ఎస్ ఎడుల్ల బయ్యారం నుంచి ఇంగ్లీష్ మీడియంలో రియాజ్, దిలీప్ కుమార్, పల్లవి అలాగే తెలుగు మీడియంలో శృతి, శ్రావణి, ఆయేశా ప్రభావవంతమైన ప్రతిభతో ముందంజలో నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు.విజేతలకు ఎంఈఓ నాగయ్య, పినపాక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. రమణ చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి చెకుముకి టాలెంట్ టెస్టులు విద్యార్థుల మేధోశక్తి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తేవడంలో కీలక పాత్ర పోషిస్తున్న జనవిజ్ఞాన వేదిక తెలంగాణ నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలిపారు.విజయం సాధించిన విద్యార్థులపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గర్వం వ్యక్తం చేస్తూ వారి భవిష్యత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బి. రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727