అక్రమ సంబంధం నే పథ్యం లో వేట కొడవళ్ళతోదాడి- ముగ్గురికి తీవ్ర‌గాయాలు

అక్రమ సంబంధం నే పథ్యం లో వేట కొడవళ్ళతోదాడి
- ముగ్గురికి తీవ్ర‌గాయాలు
నాగర్ కర్నూల్,(ఎస్ బి న్యూస్): అక్రమ సంబంధం నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాకల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని సంధ్యాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కుటుంబ సభ్యులపై కోడలు కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని సంజాపూర్ గ్రామానికి చెందిన గుర్రం మల్లేష్ కు వెల్దండ మండలం చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో సంవత్సరంన్నర క్రితం వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కాగా వీరికి వివాహానికి ముందే మల్లేష్ కు సిల్లార్ పల్లి గ్రామానికి చెందిన ఓ యువతి తో వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఈ విషయం తెలిసి పలుమార్లు పెద్దల సమక్షంలో ఇరువురికి నచ్చ చెప్పారు. కానీ ఫలితం లేకపోయింది. మూడు నెలల క్రితం మల్లేష్ ఆ యువతితో కలిసి వెళ్లిపోయాడు. అప్పటినుండి శిరీష తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. మూడు నెలలైనా మల్లేష్ ఆచూకీ దొరకకపోవడంతో శిరీష కుటుంబ సభ్యులు సంజాపూరుకు వచ్చారు. మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేలు, తమ్ముడు పరమేశ్ తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరగడంతో శిరీష కుటుంబ సభ్యులు ఆగ్రహించి గొడ్డలితో జంగయ్య, అలివేలు, పరమేష్ పై దాడికి పాల్పడ్డారు. జంగయ్య, పరమేష్ పరిస్థితి విషమంగా ఉండడం, అలివేలుకు కూడా తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం చేయడంతో పోలీసులు వెంటనే సంజాపూర్ కు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727