గుండాల మండలం వ్యాప్తంగా 11 గ్రామపంచాయతీల్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండాల గ్రామపంచాయతీలో సర్పంచ్ కోరం సీతారాములు అధ్యక్షతన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలరాజు, మిషన్ భగీరథ ఏఈ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.
