వైద్య విద్యలో ప్రభుత్వ సీటు సాధించిన నివేదన్‌ను అభినందించిన ఎమ్మెల్యే పాయం

పినపాక సెప్టెంబర్ 29 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:  పినపాక మండలం ఈ.బయ్యారం గ్రామానికి చెందిన శ్రీరామ్ నివేదన్ నీట్‌లో ప్రభుత్వ సీటు సాధించి వైద్య విద్యలో ప్రవేశం పొందడం పట్ల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నివేదన్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి చదివి నీట్‌లో ప్రభుత్వ సీటు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. నివేదన్ సాధించిన విజయం ఆయన తల్లిదండ్రులు ప్రముఖ రిపోర్టర్ శ్రీరామ్ బృహస్పతి, లతతో పాటు కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా ఈ.బయ్యారం గ్రామం, పినపాక ప్రాంతానికే గర్వకారణమని పేర్కొన్నారు.విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. నివేదన్ వైద్య విద్యలో రాణించి భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివేదన్‌కు అభినందనలు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

SBNEWS ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727