మహిళా అధికారులకు ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్ర పుస్తకాల అందజేత

మహిళా అధికారులకు ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్ర పుస్తకాల అందజేత
ఖమ్మం, సెప్టెంబర్ 8: జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం నగర మహిళా శాఖ ఆధ్వర్యంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర, ఆయన బోధనలు, మానవతా విలువలను పరిచయం చేసే పుస్తకాలను మహిళా అధికారులకు అందజేశారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు పుస్తకాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ బ్యాక్‌వర్డ్ క్లాస్ డెవలప్‌మెంట్ జ్యోతి, హార్టికల్చర్ అండ్ సిరికల్చర్ జాయింట్ డైరెక్టర్ అనసూయ, జిల్లా వెల్ఫేర్ అధికారి ప్రమీల, ఎంప్లాయ్‌మెంట్ అధికారి మాధవి, డీఆర్వో సూపరింటెండెంట్ సాదియా, సివిల్ సప్లై అధికారి సృజన, ఉమెన్స్ హబ్ కోఆర్డినేటర్ సమ్రీన్ తదితర మహిళా అధికారులకు పుస్తకాలను అందజేశారు.

ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత విశేషాలు, ఆయన బోధనలు, సమాజం పట్ల ఆయన చూపిన దయ, కరుణ, న్యాయం, సోదరభావం వంటి మానవతా విలువలను ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

స్వామి లక్ష్మీ శంకరాచార్య రచించిన ‘మహమ్మద్ ప్రవక్త చూపిన జీవన ప్రబోధనలు’, కేఎస్ రామకృష్ణారావు రచించిన ‘ఇస్లాం ప్రవక్త మహమ్మద్’, ఎస్‌.ఎమ్‌. మలిక్ రచించిన ‘ఆదర్శమూర్తి మహమ్మద్’ తదితర పుస్తకాలను అధికారులు స్వీకరించారు.

జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం నగర శాఖ అధ్యక్షురాలు అస్మా అంజుమ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాథలు, పేదలు, బలహీనులు, అవసరంలో ఉన్నవారి పట్ల దయ, కరుణ చూపాలని బోధించారని తెలిపారు. పొరుగువారి హక్కులను గౌరవించడం, వారి హక్కులను పరిరక్షించడం, సమాజంలో పరస్పర ప్రేమ, సోదరభావం, సహకారాన్ని పెంపొందించడం వంటి విలువలకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

నగర పీఆర్ కన్వీనర్ హాజీరా సదఫ్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలులైన వ్యక్తులపై మైఖేల్ హెచ్. హార్ట్ రచించిన ‘ది 100: ఎ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ’ పుస్తకంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రథమ స్థానం కల్పించారని తెలిపారు. ప్రవక్త బోధనలు, ఆయన చూపిన మార్గం ప్రపంచ చరిత్రపై చూపిన ప్రభావాన్ని ఇది తెలియజేస్తుందని అన్నారు.

సెంట్రల్ శాఖ అధ్యక్షురాలు అస్ఫీయా అంజుమ్ మాట్లాడుతూ ప్రజల పట్ల జాలి, కరుణ, ఆదరణతో వ్యవహరించాలని, మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జీవించాలని ప్రవక్త మహమ్మద్ బోధించారని తెలిపారు. దయ, న్యాయం, సోదరభావం, పరస్పర గౌరవం వంటి విలువలు సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నగర శాఖ అధ్యక్షురాలు అస్మా అంజుమ్, నగర పీఆర్ కన్వీనర్ హాజీరా సదఫ్, సెంట్రల్ శాఖ అధ్యక్షురాలు అస్ఫీయా అంజుమ్, పీఆర్ సభ్యులు ఫైజా ఇరం, సబిహా తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని వివిధ వర్గాలకు ప్రవక్త మహమ్మద్ జీవితం, ఆయన బోధించిన మానవతా విలువలను పరిచయం చేయడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727