అక్రమ బెల్ట్ షాపుల ముసుగులో గుడుంబా, నాటు సారా, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను నివారించాలి - ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్
*హైదరాబాద్ సెప్టెంబర్ 28 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
గుండాల మండల కేంద్రంలో సోమవారం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ కార్యాలయంలో భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
అనంతరం సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ కార్యాలయం నుండి గుండాల గ్రామపంచాయతీ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీగా చేరుకొని ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పి వై ఎల్ డివిజన్ అధ్యక్షులు ఊకే శ్రావణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి శంకరన్న, మండల కార్యదర్శి కొమరం శాంతన్న, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు పూనేం మంగయ్య మాట్లాడుతూ... గుండాల ప్రభుత్వ హాస్పిటల్ లో 2 నెలలుగా పర్మినెంట్ డాక్టర్ లేకపోవడంతో మండల ప్రజలు, రోగులు హాస్పిటల్ కు వస్తే పట్టించుకునే వారు లేరని, వెంటనే డి ఎం హెచ్ ఓ ద్వారా డాక్టర్ ను నియమించేలా ఎంపీడీఓ గారు చొరవ తీసుకోవాలని కోరారు. అక్రమ బెల్ట్ షాపుల ముసుగులో గుడుంబా, నాటు సారా, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను అమ్మడం వల్ల యువత భారీగా నష్టపోతోందని, 20-25 సంవత్సరాలకే యువత జీవితాలు కుప్పకూలుతున్నాయని, వెంటనే సంబంధిత ఎక్సైజ్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పి వై ఎల్ డిమాండ్ చేసింది. మండల కార్యదర్శి కల్తీ సుదర్శన్ కార్యకర్తలు వజ్జా ధర్మరాజు, జబ్బ గణేష్, పుణ్యం సుధాకర్, కుంజ నరేష్, తెల్లం రాజు, సుతారి భాస్కర్, పోతిరెడ్డి గూడెం, బాటన్ననగర్, కొడవటంచ, ముత్తాపురం గ్రామాల నుండి యూత్ పాల్గొన్నారు.
Tags
BHADRADRI KOTHAGUDEM