పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎంపీడీఓ సంకీర్త్,అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లులు,ప్రభుత్వ పథకాలు తదితర సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను అధికారులు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.
Tags
పినపాక