తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను
పినపాక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ చిత్రపటానికి ఎంపీడీవో సంకీర్త్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని అన్నారు. నాటి దొరల అణచివేతకు ఎదురొడ్డి హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమన్నారు . అన్యాయాన్ని ఎదిరించడంలో మహిళా శక్తిని చాటిచెప్పిన మహనీయురాలు ఐలమ్మ అని కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని చాకలి ఐలమ్మ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.
Tags
పినపాక