గుట్కా, మత్తు పదార్థాలు పాఠశాలలోకి ఎలా వస్తున్నాయి?
గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలి.
సిపిఎం మండల కార్యదర్శి తోలం గోపి
*గుండాల మండలం సెప్టెంబర్ 16 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
గుండాల మండలం ముత్తాపురంలో గల ఏకలవ్య మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ నితిన్ సింగ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మానుకోవాలని గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కృషి చేయవలసిన ప్రిన్సిపల్ అకారణంగా క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు టిసిలు ఇస్తామని బెదిరించడం విద్యార్థుల తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయడం సరికాదని సిపిఎం గుండాల మండల కార్యదర్శి తోలం గోపి మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్ ముత్తాపురంలో క్రమశిక్షణ పూర్తిగా లోపించిందని దీనికి పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ వహించాలని అన్నారు. గిరిజన విద్యార్థులు నాణ్యమైన విద్య కొరకు ఏకలవ్య మోడల్ స్కూల్లో చేరితే అకారణంగా టీసీలు ఇస్తానంటూ భయభ్రాంతులకు గురి చేస్తు విద్యా సంవత్సరం మధ్యలో గిరిజన విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నాడని విద్యాభివృద్ధికి అడ్డుపడుతున్నాడని తక్షణమే ఉన్నతాధికారులు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు కోరారు. ఏకలవ్య మోడల్ స్కూల్ ముత్తాపురంలో విద్యా సంవత్సరం గడిచి నాలుగు నెలలు అవుతున్న ఇంతవరకు పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేయలేదని, స్టూడెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదని ఇంతవరకు పేరెంట్స్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసిన దాఖలలు లేవని పాఠశాలలో సమస్యలు ఏర్పడితే పేరెంట్స్ కమిటీ విద్యా కమిటీతో చర్చించకుండా ప్రిన్సిపాల్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఎక్కడిదని ప్రశ్నించారు. విద్యార్థులు మారక ద్రవ్యాలు, గుట్కాలు సేవిస్తున్నారని అకారణంగా క్రమశిక్షణ పేరుతో చర్యలు తీసుకునే ప్రిన్సిపాల్ పాఠశాల ఆవరణంలోకి ఈ మారక ద్రవ్యాలు, గుట్కాలు ఎలా వస్తున్నాయని
ప్రిన్సిపల్ ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఎందుకు చేయలేదని ఎక్కడ ఇవి అమ్ముతున్నారని ప్రాథమిక దర్యాప్తు కూడా నిర్వహించకుండా క్రమశిక్షణ పేరుతో గిరిజన విద్యార్థులకు టీసీలు ఇస్తానని బెదిరించడం భావ్యం కాదని అన్నారు. ఏకలవ్య స్కూల్లోని సమస్యలను పరిష్కరించాలని అకారణంగా టిసిల పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్న ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆయన కోరారు.