*ఐక్యతకు ప్రతీకగా అశ్వాపురం ప్రెస్ క్లబ్...*- చట్టబద్ధంగా అశ్వాపురం ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ (RC:257/2025)...- జర్నలిస్టులకు అశ్వాపురం తహశీల్దార్ సూర్యప్రకాష్ అభినందనలు...

అశ్వాపురం మండల కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అశ్వాపురం ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ (RC.NO 257/2025)సర్టిఫికెట్‌ను అశ్వాపురం తహశీల్దార్ సూర్యప్రకాష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్వాపురం ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో తహశీల్దార్ సూర్యప్రకాష్ ను శాలువాతో సన్మానించారు.అనంతరం ఆయన చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ జర్నలిస్టులంతా ఐక్యంగా ఒక సంఘంగా ఏర్పడి, చట్ట బద్ధంగా ప్రెస్ క్లబ్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమానికి ప్రెస్ క్లబ్ ఒక వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు  వెలమ రాజేందర్ మాట్లాడుతూ అశ్వాపురం ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం,ఐక్యతతో పాటు మండలంలోని ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో అశ్వాపురం ప్రెస్ క్లబ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నిబంధనల ప్రకారం ప్రెస్ క్లబ్‌ను నిర్వహిస్తూ జర్నలిస్టులందరికీ అందుబాటులో ఉండేలా కార్యాచరణ కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ లీలావతి, రెవెన్యూ సిబ్బంది, ప్రెస్ క్లబ్ సభ్యులు,  పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727