బోనాలతో చవిటిగూడెం సందడి ..ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధిలో భక్తజన కోలాహలం.బోనమెత్తిన ప్రతి అడుగులో భక్తి..అమ్మవారి సన్నిధిలో ప్రతి మనసులో శక్తి..ముత్యాలమ్మ తల్లి దీవెనలతో చవిటిగూడెం

అశ్వాపురం మండలం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి బోనాల వేడుకలు శ్రావణమాసం రెండు ఆదివారం చవిటిగూడెం గ్రామంలో భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు ఇంటిని శుభ్రం చేసుకుని భక్తిశ్రద్ధలతో  అమ్మవారికి నైవేద్యం వండి  బోనాo నెత్తిన ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. “అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలి.. ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలి” అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థించారు.గ్రామ దేవత బొడ్రాయి వద్ద తొలి పూజ నిర్వహించారు. నైవేద్యం సమర్పించి, పొట్టేళ్ళు బలి ఇచ్చి అమ్నవారికి మొక్కులు చెల్లించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుడి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించారు.

బోనాల వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727