ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయండి.

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయండి.

అఖిలపక్ష పార్టీలు, ఆదివాసికుల సంఘాల పిలుపు.

గుండాల మండలం ఆగస్టు 2 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:


ఆగస్టు 9ప్రపంచ ఆదివాసి దినోత్సవంని జయప్రదం చేయాలని ఈరోజు అఖిలపక్ష పార్టీలు, మరియు ఆదివాసికుల సంఘాల ఆధ్వర్యంలో  గుండాల మండలం కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు రమణబాబు అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
 ఈ సమావేశంలో ఆలిండియా ట్రైబల్ ఫోరం (ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, ఆదివాసి సంక్షేమ పరిషత్ (ఏ ఎస్ పి) జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర ప్రజాపంద (మాస్ లైన్)గుండాల మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ కొమరం శాంతయ్య పాల్గొని మాట్లాడుతూ, 1982 ఆగస్టు 9 జెనివాలో  ఆదివాసీల కోసం జరిగిన తొలి యునైటెడ్ నేషన్ కార్యవర్గ సమావేశానికి గుర్తుగా 1994 నుంచి ప్రతి ఏట ఈరోజు ఆగస్టు 9 ని ప్రపంచ ఆదివాసి దినంగా జరుపుకుంటున్నారని అన్నారు. అందులో భాగంగానే ఆగస్టు 9న గుండాల మండల కేంద్రంలో జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల రక్షణ కోసం 1/70. పిసా చట్టాలు ఉన్నప్పటికీ వీటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. 1/70 యాక్ట్ పీసా చట్టాలు  అమలు లొ  ఉన్నప్పటికీ ఏజెన్సీలో హరితహారం, ఓపెన్ కాస్టుల పేరుతో అనేకమంది ఆదివాసీల భూములను ప్రభుత్వాలు ఎలాంటి పరిహారం లేకుండా గుంజుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 3 ద్వారా అనేకమంది ఆదివాసి, యువతి, యువకులకు ఉద్యోగాలు వచ్చాయని ఈ జీవో నెంబర్ 3ని కూడా రద్దు చేయడం ద్వారా ఆదివాసి యువతీ, యువకులు ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు 
  ప్రత్యేకంగా ఆదివాసీల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏలలో కూడా గిరిజనేతరులు పేత్తనాలు చేస్తున్నారని ఆదివాసీల అస్తిత్వం, ఆదివాసి చట్టాలు కాపాడుకోవడం కోసం కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసి ప్రజలు, ఆదివాసి ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు, ఆదివాసి గ్రామ పెద్దలు దొర పటేల్, యువత, మహిళలు,విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి మద్దతుగా ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, బిజెపి మండల అధ్యక్షులు సోలం సతీష్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వర్షిక రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసం పాపారావు, అఖిల భారత రైతు కూలి సంఘం మండల అధ్యక్షులు గడ్డం లాలయ్య, ఏఐటిఎఫ్ రాష్ట్ర నాయకులు ఈసం కృష్ణ, ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల నాయకులు కల్తీ లక్ష్మణ్,గోగ్గేలా సుధాకర్, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గోవింద నరసింహారావు, మాస్ లైన్ మండల నాయకులు తెల్లం రాజు తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించడం జరిగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727