సన్న వడ్లకు రూ.500 బోనస్‌ రావాలంటే ఆన్లైన్ తప్పనిసరి

సన్న వడ్లకు రూ.500 బోనస్‌ రావాలంటే ఆన్లైన్ తప్పనిసరి
-సెప్టెంబర్‌ 10లోపు నమోదు చేసుకోండి
- పినపాక ఏవో వెంకటేశ్వర్లు
 స్వాతంత్ర్య  భారత్ న్యూస్ ప్రతినిధి పినపాక:
ఖరీఫ్‌ 2026 సీజన్‌లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వరి సాగు చేస్తున్న రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందాలంటే ఆన్లైన్ తప్పనిసరిగా చేయించాలని పినపాక వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పినపాక రైతు వేదికలో అయిన మాట్లాడుతూ బోనస్‌ పొందాలనుకునే రైతులు సెప్టెంబర్‌ 10లోపు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సంబంధిత డీలర్‌ వద్దే తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకున్న వారు లేదా ఇతర వనరుల నుంచి విత్తనాలు తెచ్చుకుని సాగు చేస్తున్న రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ను సంప్రదించి తమ వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతులు గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, సెప్టెంబర్‌ 10 తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత నమోదు చేసుకునే రైతులకు ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ వర్తించదని ఏవో వెంకటేశ్వర్లు తెలిపారు. సన్న వరి సాగు చేస్తున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోవాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

SBNEWS ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727