అశ్వాపురం ఎస్సీ కాలనీలో పందుల బెడద.. తీవ్ర ఇబ్బందికి గురవుతున్న గ్రామస్తులు... సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ కి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు

అశ్వాపురం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పందుల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందులు వీధుల్లో తిరుగుతూ చెత్తను చెల్లాచెదురు చేయడంతో కాలనీలో దుర్వాసన వెదజల్లుతోంది.

వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసనతో పాటు అపరిశుభ్ర వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని పంచాయతీ సెక్రెటరీ యాకుబ్ ,అశ్వాపురం సర్పంచ్ సోదరులాల్ లకు వినతి పత్రం అందజేసి 

ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి పందుల బెడదను నివారించడంతో పాటు కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు. 

ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీవాసులు గొల్లపల్లి నరేష్ కుమార్, ఈనపల్లి పవన్ సాయి, ఇసంపల్లి ప్రసాద్, గరాటి రాంబాబు, కనుకు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727