ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కల నాటకం

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కల నాటకం
-పర్యావరణ పరిరక్షణతో పాటు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన
భద్రాచలం, జూలై 29 (SB న్యూస్): ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మొక్కల నాటకం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. జాన్ మిల్టన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్), ఎకో క్లబ్, యాంటీ డ్రగ్ కమిటీ సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో వివిధ రకాల నీడ, ఫల, ఔషధ మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేశారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మై భారత్ పోర్టల్ జిల్లా కన్వీనర్ రాంబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రకృతిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, చెట్లు మనిషి మనుగడకు ఆధారం అని పేర్కొన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని సూచించారు.అదేవిధంగా నేటి యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరమని పేర్కొంటూ, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. జాన్ మిల్టన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షాభావం వంటి సమస్యలను అధిగమించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడం ఒక్కటే మార్గమని అన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హవీలా, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాధికారులు డాక్టర్ కిరణ్ కుమార్, బి. సుధాకర్ రావు, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ–విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో కళాశాల ఆవరణను మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి మొక్కలు నాటి వాటి సంరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727