పాయం గెలుపు ఏ ఒక్కరి సొత్తు కాదు.. కార్యకర్తల సమిష్టి కృషి ఫలితంపాయం గెలుపు కోసం అందరూ కష్టపడ్డారు.. ఏ ఒక్క వర్గం వల్ల పాయం గెలవలేదు..పత్రికలలో పెయిడ్ ఆర్టికల్ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు

పినపాక  నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజయం ఏ ఒక్కరి సొత్తు కాదని, కాంగ్రెస్ పార్టీ బలమైన సంస్థాగత శక్తి, నాయకత్వం, వేలాది మంది కార్యకర్తల సమిష్టి కృషి, ప్రజలలో పాయంకి ఉన్న చరిష్మా, ఆదరణ, నమ్మకం ఆశీర్వాదాల ఫలితమే ఆ విజయం అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాయం విజయానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు, అభిమాని అహర్నిశలు శ్రమించారని చెప్పారు. అలాంటి విజయాన్ని తమ వల్లే సాధ్యమైందని ఒక వర్గం పత్రికల్లో పెయిడ్ కథనాలు ప్రచారం చేయించుకోవడం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమని విమర్శించారు.

2014 ఎన్నికల్లో ఇదే వర్గానికి చెందిన నాయకుడు బలపరచిన అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదనే విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. అలాగే గతంలో (2023 తర్వాత) జరిగిన పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వారు కాంగ్రెస్‌కు   వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ, అత్యధిక మెజార్టీతో గెలవలేదా అని ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన భారీ మెజారిటీని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయారని పేర్కొన్నారు.

మొన్నటి పంచాయతీ ఎన్నికలలో మణుగూరు మండలోని సమితిసింగారం పంచాయతీలో ఆ వర్గం నిలబెట్టిన నాయకుడు ఇంటింటి ప్రచారం చేస్తే వారి అభ్యర్థికి కనీసం ఓట్లు దక్కలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి 

ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, పెయిడ్ ఆర్టికల్స్‌తో చరిత్రను మార్చలేరని అన్నారు. పాయం వెంకటేశ్వర్లు గెలుపు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన ప్రజల తీర్పు, ప్రతి కార్యకర్త కష్టానికి దక్కిన గౌరవమని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727