మల్లెల గుంపు ప్రభుత్వ పాఠశాలకు వెంటనే శాశ్వత భవనం నిర్మించాలి: పి డి ఎస్ యు డిమాండ్

మల్లెల గుంపు ప్రభుత్వ పాఠశాలకు వెంటనే శాశ్వత భవనం నిర్మించాలి: పి డి ఎస్ యు డిమాండ్ 

 ఆదివాసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు

గుండాల మండలం జులై 16 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

గుండాల మండలం చిన్న వెంకటాపురం మల్లెల గుంపులో ప్రభుత్వ పాఠశాలకు ఇప్పటివరకు శాశ్వత భవనం లేకపోవడం తీవ్ర ఆందోళనకరమని పీడీఎస్‌యూ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు బృందం పాఠశాలను సందర్శించారు, నాయకులు మాట్లాడుతూ
పాఠశాల భవనం లేకపోవడంతో గ్రామస్తులే తమ సొంత ఖర్చులతో తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసి,పట్టాలు కప్పి,దానిలో విద్యార్థులకు బోధన కొనసాగేలా చేస్తున్నారని,
విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం మరియు ఎండాకాలంలో విద్యాభ్యాసం మరింత కష్టతరంగా మారుతోందని వారు తెలిపారు. ప్రభుత్వాలు విద్యాభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉందన్నారు.పూర్తి ఆదివాసీ మారుమూల ప్రాంతమైన మల్లెలంగుంపు,ఆదివాసీ విద్యార్థులు విద్య దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
 పాలక ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు మల్లెలంగుంపు పక్క భవన నిర్మాణం పట్ల నిర్లక్ష్యం విడాలని,
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చిన్న వెంకటాపురం మల్లెల గుంపులో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, శాశ్వత భవనం నిర్మాణం చేపట్టాలని పీడీఎస్‌యూ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. . విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727