SIR ప్రక్రియలో పాల్గొని ఓటును నమోదు చేయించుకోవాలి: సర్పంచ్ మాధవరావు, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్

 SIR ప్రక్రియలో పాల్గొని ఓటును నమోదు చేయించుకోవాలి: సర్పంచ్ మాధవరావు, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్ 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు గ్రామంలో విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్ స్థానిక ప్రజలతో మాట్లాడి డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ SIR ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఎం చారి, భాగం రవి, బుర్ర సదానందం, కాకర్లపూడి సుబ్బరాజు, స్వామి, అశోక్‌నగర్ యూత్ కమిటీ సభ్యులు కుంటా రవి, సాంబ, ఎస్‌కే పాషా, లోకేష్, మేకల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

#SIR #VoterRegistration #Manuguru #SamithiSingaram #Pinapaka #PayamVenkateswarlu #CongressParty #BhadradriKothagudem #Telangana #SBNews 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727