రైతుల సమస్యలను పరిష్కరించాలి: బీఆర్ఎస్ డిమాండ్

రైతుల సమస్యలను పరిష్కరించాలి: బీఆర్ఎస్ డిమాండ్
పినపాక : రైతు సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పినపాక మండలం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎరువుల పంపిణీలో యాప్ విధానాన్ని రద్దు చేసి సకాలంలో రైతులకు ఎరువులు అందించాలని కోరారు. రైతులు పండించే అన్ని రకాల ధాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేసి, కొనుగోలు ఆంక్షలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు నిధులను అన్ని ఎకరాలకు వర్తింపజేసి, రైతుభీమా ప్రీమియాన్ని పూర్తిస్థాయిలో చెల్లించి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ చైర్మన్ రవి శేఖర్ వర్మ, మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సీనియర్ నాయకులు వాసు బాబు, పోలిశెట్టి సత్తిబాబు, బత్తుల వెంకటరెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727