వైద్య సిబ్బందిపై క్రిమినల్ కేస్ నమోదు చెయ్యాలి

వైద్య సిబ్బందిపై క్రిమినల్ కేస్ నమోదు చెయ్యాలి

•వనజా మృతికి కారకులని కఠినంగా శిక్షించాలి

•తక్షణమే బాధ్యుడిగా డి ఎమ్ హెచ్ ఓ ను సస్పెండ్ చేయాలి

•కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్రేషియా చెల్లించాలి

•మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

*గుండాల మండలం జూన్ 22 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

గుండాల పీహెచ్సీలో ఈ నెల 13వ తారీఖున డెలివరీ చేసి చాట్ల వనజ మృతికి కారకులైన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలోని అంబులెన్స్ను ఇతర మండలాలకు కేటాయించి ఏజెన్సీ ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందుబాటులో లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ వైపల్యం చెందినందుకు, ప్రధాన బాధ్యుడిగా డీఎంహెచ్వోను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం శంబునిగూడెం గ్రామంలోని చాట్ల వనజ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విచారణ పేరుతో అర్ధరాత్రి విచారణ చేపడుతూ తూతుమంతంగా చర్యలు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారు. ఇంత జరిగిన వనజ కుటుంబానికి ప్రభుత్వపరంగా దహన సంస్కారాలకు కూడా ఆర్థిక సాయం అందించడంలో ఐటీడీఏ పీవో, కలెక్టర్ వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వం వనజ కుటుంబానికి 25 లక్షల ఎక్స్రేజెస్ చెల్లించాలని, వనజ భర్త సంజీవరావుకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వనజ కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ మంజు భార్గవి, తెల్లం భాస్కర్, పాయం నరసింహారావు, తిరుకోల్లూరి రాము, మోకాళ్ళ వీరస్వామి, గోగ్గేల రామయ్య, గడ్డం వీరన్న, హాఫిజ్, సుధాకర్, రాములు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727