పినపాక సర్పంచుల ఆవేదన పట్టించుకోండి సారు- ఎంపీడీవో కు,పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సర్పంచులు

పినపాక సర్పంచుల ఆవేదన పట్టించుకోండి సారు
- ఎంపీడీవో కు,పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సర్పంచులు
- లేని తీర్మానాలకు బిల్లులు ఎలా చేయాలి..?
- కలెక్టరే సమాధానం చెప్పాలని సర్పంచుల కన్నీటి ఆవేదన
పినపాక మండలంలోని పలువురు గ్రామపంచాయతీ సర్పంచులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభలు, పంచాయతీ తీర్మానాలు లేకుండానే కొన్ని పనులకు బిల్లులు చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీడీవోకు,పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
గ్రామపంచాయతీలకు సంబంధించిన నిబంధనలు, చట్టాలను పాటిస్తూ పని చేస్తున్న తమపై అనవసర ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదని సర్పంచులు పేర్కొన్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా బిల్లులు ఎలా చేయగలమని ప్రశ్నించారు.
ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.తమ ఆవేదనను అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని సర్పంచులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727