జర్నలిస్టులకు వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇస్తాం – సీఎం రేవంత్ రెడ్డి

జర్నలిస్టులకు వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇస్తాం – సీఎం రేవంత్ రెడ్డి
జర్నలిస్టులకు సొసైటీల పేరుతో కాకుండా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  

న్యూఢిల్లీలో శనివారం జర్నలిస్టులతో జరిగిన భేటీలో సీఎం మాట్లాడుతూ, “జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే సంకల్పంతోనే కేబినెట్ సబ్ కమిటీ వేశాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకురండి. సబ్ కమిటీ ఒకే చోట కూర్చొని సిఫార్సులు తీసుకువస్తే, మీరు టీ తాగే లోపే మినిట్స్ రాసి కేబినెట్‌లో ఆమోదిస్తాం” అని చెప్పారు.  

వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధానం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు రాకుండా ఉంటాయని సీఎం వివరించారు. “సొసైటీలపై పిటిషన్ వేయడం సాధ్యమే, కానీ ఒక్కొక్కరి పేరు మీద ఇస్తే ఎవరూ పిటిషన్ వేయలేరు. ఒక్కొక్కరి పేరు మీదే వేయాల్సి వస్తుంది. అది ఆచరణ సాధ్యం కాదు. భవిష్యత్తులో ఈ ఇళ్ల స్థలాలపై ఎలాంటి వివాదాలు రాకూడదన్నదే మా ఉద్దేశం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నిర్ణయంతో వారి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727