రామానుజవరం ఇసుక క్వారీపై చర్యలు తీసుకోవాలి:బీఆర్ఎస్ డిమాండ్

 రామానుజవరం ఇసుక క్వారీపై చర్యలు తీసుకోవాలి:బీఆర్ఎస్ డిమాండ్ 

పినపాక: మణుగూరు మండలం రామానుజవరం ఇసుక క్వారీ నిర్వాహకులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్  పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రామానుజవరం ఇసుక క్వారీకి చెందిన వందలాది లారీలు సోమవారం సాంబాయిగూడెం వద్ద మణుగూరు–ఏటూరునాగారం ప్రధాన రహదారిపై నిలిచిపోవడంతో సుమారు రెండు గంటల పాటు భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని తెలిపారు. దీంతో ప్రయాణికులు, అత్యవసర సేవలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని అన్నారు.
ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా పినపాక మండలం పోట్లపల్లి పంచాయతీ గడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. ఆత్మహత్యాయత్నం చేసిన అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సమయానికి వైద్యం అందక మృతి చెందినట్లు పేర్కొన్నారు.అలాగే ఇటీవల జరిగిన నీట్‌ పరీక్షకు హాజరుకావాల్సిన ఓ విద్యార్థిని కూడా ఇసుక లారీల వల్ల ఏర్పడిన ట్రాఫిక్‌ కారణంగా పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోలేకపోయిందని అన్నారు.ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు, రవాణా శాఖలు ప్రధాన రహదారులపై ఇసుక లారీలు నిలిపివేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ సమావేశంలో బీ ఆర్ ఎస్ నాయకులు గుమ్మడి గాంధీ, దాట్ల వాసుబాబు, పొనుగోటి భద్రయ్య, రవివర్మ, పోలిశెట్టి సత్తిబాబు, బత్తుల వెంకటరెడ్డి, చెన్నకేశవులు, షేక్‌ జాంగీర్‌, బూర రమేష్‌, పడిగె అశోక్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

#Pinapaka #Manuguru #RamanujavaramSandQuarry #BRS #PagadalaSatishReddy #TrafficJam #SandLorries #SBNEWS #BhadradriKothagudem #TelanganaNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727