గోదారమ్మ క్యాంపులో వీధి కుక్కల స్వైర విహారం.. ప్రజల్లో భయాందోళన

గోదారమ్మ క్యాంపులో వీధి కుక్కల స్వైర విహారం.. ప్రజల్లో భయాందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోదారమ్మ క్యాంపులో వీధి కుక్కలు, కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులపై వీధి కుక్కలు విరుచుకుపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, చేతిలో కవర్లు లేదా ఆహార పదార్థాలు పట్టుకుని బయటకు వెళ్లిన వారిపై కుక్కలు, కోతులు ఎగబడుతున్నాయి. వాటిని తరిమే ప్రయత్నం చేసిన వారిపై కూడా దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు.
గత వారం రోజుల వ్యవధిలో గోదారమ్మ క్యాంపులో నలుగురిని వీధి కుక్కలు కరిచినట్లు సమాచారం. తాజాగా ఈరోజు మరో మహిళపై దాడి చేసి గాయపరిచిన ఘటన స్థానికులను మరింత ఆందోళనకు గురిచేసింది.
గ్రామసభలో వీధి కుక్కలు, కోతుల సమస్యపై ఇప్పటికే తీర్మానం చేసినప్పటికీ ఇప్పటివరకు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వీధి కుక్కలు, కోతుల బెడదను నివారించాలని సారపాక మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు కోరుతున్నారు.

#Sarapaka #GodarammaCamp #StrayDogs #MonkeyMenace #Burgampadu #BhadradriKothagudem #PublicSafety #TelanganaNews #SBNews 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727