అమరజీవి జోగ నర్సయ్యఆశయాల సాధనకు ఉద్యమిద్దాం

అమరజీవి జోగ నర్సయ్య
ఆశయాల సాధనకు ఉద్యమిద్దాం

జూన్ 1న తూరుబాకలో స్మారక స్థూపం, విగ్రహావిష్కరణ సభను జయప్రదం చేయండి: సీపీఎం నాయకుల పిలుపు

గుండాల మండలం జూన్ 1 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

 గుండాల మండల ప్రజా ఉద్యమాల నేత, ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన అమరజీవి జోగ నర్సయ్య ఐదో వర్ధంతి సందర్భంగా జూన్ 1న తూరుబాక గ్రామంలో నిర్వహించే స్మారక స్థూపావిష్కరణ, విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివాసీ కుటుంబంలో జన్మించిన జోగ నర్సయ్య చిన్ననాటి నుంచే ప్రజా సమస్యల పట్ల చైతన్యం పెంపొందించుకుని కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, గిరిజనుల భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమం కోసం నిరంతర పోరాటాలు సాగించారు. జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన నర్సయ్య, అనంతరం ప్రజా నాయకుడిగా ఎదిగి గుండాల మండల ప్రజల మన్ననలు పొందారు. 1998లో తుడుందెబ్బ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన, జీఓ నంబర్--3 అమలు, పోడు భూముల హక్కుల సాధన కోసం గ్రామాలన్నింటిలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఆదివాసీ విద్యార్థి సంఘాల నిర్మాణంలో కృషి చేయడంతో పాటు గుండాలలో జూనియర్ కళాశాల, ఎస్ఎంహెచ్ హాస్టల్ ఏర్పాటుకు ఉద్యమించి ఫలితాలు సాధించారు. 2007లో సీపీఎం సభ్యత్వం స్వీకరించిన జోగ నర్సయ్య పార్టీ పిలుపు మేరకు ఆదివాసీలు, రైతులు, కూలీల సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. పోడు భూముల సాగుదారులపై అటవీశాఖ వేధింపులను అరికట్టాలని, తునికాకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని నిరంతరం ఉద్యమాలు చేపట్టారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణకు వ్యతిరేకంగా గ్రామగ్రామాన ప్రజలను చైతన్యపరిచి అఖిలపక్షాలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించారు. గుండాల మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహ స్థాపన కోసం విశేష కృషి చేసి విజయవంతం చేశారు. అటవీ హక్కుల చట్టం అమలు కోసం కూడా ఆయన విశేషంగా పోరాడారని నాయకులు పేర్కొన్నారు. గిరిజనులు, పేదలు తమ భూములపై హక్కులు పొందడంలో అటవీ హక్కుల చట్టం కీలకమైందని, ఆ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని జోగ నర్సయ్య ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి సమయంలో 2021 మే 22న జోగ నర్సయ్య ఆకస్మికంగా మృతిచెందడం ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రజల కోసం జీవించిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని అన్నారు. జూన్ 1న తూరుబాక గ్రామంలో నిర్వహించే స్మారక స్థూపావిష్కరణ, విగ్రహావిష్కరణ సభకు ఆదివాసీలు, రైతులు, కూలీలు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727