కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 12 ఏళ్లగా రైతులను మోసం చేస్తూనే ఉంది

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 12 ఏళ్లగా రైతులను మోసం చేస్తూనే ఉంది

గుండాల మండలం మే 30 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం గడిచిన 12 సంవత్సరాలుగా రైతులను మోసం చేస్తూనే ఉంది. ఎం ఎస్ పి రేటు ప్లస్ 50% అమలు చేయకుండా రైతులకు ద్రోహం చేస్తూ చాపకింద నీరుల చీకటి చట్టాలను అమలు చేసేందుకు చూస్తుందని గుండాల మండల అఖిలపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.  శుక్రవారం గుండాల మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షుడు గడ్డం లాలయ్య అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యాలయం నుండి మండల కేంద్రంలోని బొడ్రాయి సెంటర్ వద్దకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాల ప్రతులను దగ్నం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు రాష్ట్రంలో కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలను రెండు ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి తప్ప రైతులకు మేలు చేసే విధంగా ఏ ఒక్క ప్రభుత్వం చొరో చూపటం లేదని ఆయన పేర్కొన్నారు. పేరుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను తెరిచి కొంటున్నారే తప్ప మద్దతు ధర విషయంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా రైతులకు మేలు చేయడం లేదని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు వ్యతిరేక విధానాలను మానుకొని రైతాంగ సమస్యలను తెలుసుకొని పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గడ్డం లాలయ్య, వై. వెంకన్న, ఈసం కృష్ణ,పెండకట్ల పెంటన్న ఎల్లన్న , ఉపేందర్, లాలు,ఈసం శంకరన్న, మాచర్ల సత్యం, తెల్లం రాజు, జగన్, తెల్లం భాస్కర్, గడ్డం వీరన్న, టి రాము,ప్రమోద్, ప్రశాంత్, ఈసం శ్రీను, బొమ్మెర్ల నాగేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727