గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం: ఎంపీడీఓ వెంకటేశ్వరరావు

గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం: ఎంపీడీఓ వెంకటేశ్వరరావు

పినపాక, గురువారం: గ్రామాల సమస్యల పరిష్కారమే గ్రామసభల నిర్వహణ ముఖ్య ఉద్దేశమని ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. పినపాక మండలంలోని 23 గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించగా, పొట్లపల్లి, భూపాలపట్నం, జానంపేట తదితర గ్రామాల్లో జరిగిన సభలకు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు వంటి పథకాల ద్వారా వేలాది మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 60 వేల రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు.

గ్రామసభల ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించవచ్చని, ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ గోపాలకృష్ణ, ఈసీ వీరభద్ర స్వామి, ఏఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727