దూదియా తండాకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయాలి – గ్రామ ప్రజల వినతి

స్వతంత్ర భారత్ | ఏప్రిల్ 13

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవి పల్లి మండలం దూదియా తండా గ్రామపంచాయతీకి చెందిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 70 సంవత్సరాలుగా నివసిస్తున్న ఈ గ్రామంలో మూడు తండాలు కలిపి దాదాపు 200 గృహాలు, 1200 పైచిలుకు జనాభా జీవనం సాగిస్తున్నారు.

రోజువారీ కూలి పనులపై ఆధారపడిన ఈ ప్రజలు నివాస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు పథకంను పైలెట్ ప్రాజెక్టుగా తమ గ్రామంలో అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న L1, L2, L3 జాబితాల్లో మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రామపంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్, ITDA POలకు గ్రామ ప్రజలు విన్నవించారు.

ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రయోజనం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని దూదియా తండా గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గుగులోత్ నరేష్ తెలిపారు.



#దూదియా_తండా #ఇందిరమ్మఇల్లు #భద్రాద్రికొత్తగూడెం #లక్ష్మీదేవిపల్లి #గ్రామఅభివృద్ధి #పేదలకోసం #హౌసింగ్పథకం #తెలంగాణ #గ్రామసమస్యలు #YouthVoice #sbnews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727