పినపాక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి: రేణుక చౌదరికి వినతి
మణుగూరు, ఏప్రిల్ 13:
పినపాక నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక సమస్యలను పరిష్కరించాలని మణుగూరుకు చెందిన సామాజిక కార్యకర్త కర్నె రవి, రాజ్యసభ సభ్యురాలు Renuka Chowdhuryను కోరారు. ఈ మేరకు ఆమెకు వినతిపత్రం సమర్పించారు.
మణుగూరును మళ్లీ గ్రామపంచాయతీగా మార్చడం, రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పూర్తి పరిహారం చెల్లించడం, పాలిటెక్నిక్ కళాశాల కొనసాగింపు, స్థానిక యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే 100 పడకల ఆసుపత్రిలో ఖాళీల భర్తీ, ప్రాజెక్టుల పూర్తి, రైళ్ల పునరుద్ధరణ, పోడు భూముల పట్టాల మంజూరు, గోదాముల నిర్మాణం వంటి డిమాండ్లు చేశారు.
ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులు మంజూరు చేయించాలని కర్నె రవి కోరారు.
Tags
మణుగూరు