చరిత్ర పుటల్లో శాశ్వత విజేత అంబేద్కర్

చరిత్ర పుటల్లో శాశ్వత విజేత అంబేద్కర్
-మణుగూరులో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం మణుగూరు ప్రజాభవన్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు పీరినాకి నవీన్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాభవన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డీజే తో ఊరేగింపుగా వెళ్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, జనరల్ సెక్రటరీ చెరుకుపల్లి దుర్గారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పీరినాకి నవీన్ మాట్లాడుతూ,
డాక్టర్ అంబేద్కర్ అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. అంటరానితన నిర్మూలన, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వాన్ని స్థాపించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం సాధనలో ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమని అన్నారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ సమాజంలో అసమానతలను నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చింతల కృష్ణ, రవి, నానాజీ, గోల్డ్ రవి, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.


#AmbedkarJayanti #DrBRAmbedkar #Manuguru #Pinapaka #BhadradriKothagudem #SocialJustice #Equality #IndianConstitution #CongressParty #TelanganaNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727