నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలకు మద్దతు.. డిప్యూటీ డీఈఓ సస్పెండ్ చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలకు మద్దతు.. డిప్యూటీ డీఈఓ సస్పెండ్ చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ
ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు మద్దతు ఇస్తున్న డిప్యూటీ డీఈఓను సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు పట్టణ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ, ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.

విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్ల కోసం ఒత్తిడి చేయడం, పుస్తకాలు, టై-బెల్ట్ పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తన నివాసాన్ని కార్యాలయంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలల ఫైళ్లపై సంతకాలు చేయాలంటే సాయంత్రం తర్వాత ఇంటికి రావాలని చెప్పడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి విచారణ జరిపి సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727