ధాన్యం కొనుగోలు తక్షణం ప్రారంభించాలి: సిపిఎం డిమాండ్

ధాన్యం కొనుగోలు తక్షణం ప్రారంభించాలి: సిపిఎం డిమాండ్
అశ్వాపురం మండలం రామచంద్రాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే. బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు సబ్బిరెడ్డి కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు.

గత 15 రోజులుగా సుమారు 50 మంది రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఆరబోసినా, ఇప్పటివరకు వ్యవసాయ శాఖ లేదా సొసైటీ అధికారులు కొనుగోలు ప్రారంభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నాయని సిపిఎం విమర్శించింది.

వాతావరణ మార్పులు, అకాల వర్షాల ప్రమాదం దృష్ట్యా రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యే అవకాశం ఉందని నాయకులు హెచ్చరించారు. అలాగే ఎండల తీవ్రత వల్ల తేమశాతం తగ్గి ధాన్యం పొట్లిపోయి తూకం తగ్గిపోతుందని, రైతులు నష్టపోతారని పేర్కొన్నారు.

జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉన్నప్పటికీ కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌కు ఫోన్ చేసి సమస్యను వివరించగా, రేపటి నుంచే కొనుగోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అయితే ఇచ్చిన హామీ అమలు కాకపోతే రైతులను సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు అశోక్ రెడ్డి, రైతులు పగడాల శ్రీనివాస్ రెడ్డి, ఎం. సుధాకర్ రెడ్డి, కె. ఎల్లారెడ్డి, ఎం. సమ్మిరెడ్డి, రామన్న తదితరులు పాల్గొన్నారు.

#ధాన్యం_కొనుగోలు #రైతు_సమస్యలు #సిపిఎం #అశ్వాపురం #రామచంద్రాపురం #తెలంగాణ_రైతు_సంఘం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727