ఎట్టి స్వప్న కుటుంబానికి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా ఆర్థిక సాయం

ఎట్టి స్వప్న కుటుంబానికి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా ఆర్థిక సాయం

గుండాల మండలం, మార్చి 11 (స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎట్టి స్వప్న శిశు సంరక్షణ శస్త్రచికిత్స సమయంలో మృతి చెందడం పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మానవత్వాన్ని చాటుతూ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ పోతిరెడ్డిగూడెం గ్రామ కమిటీ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసింది.

బుధవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కలిసి ఎట్టి స్వప్న భర్త ఎట్టి రాంబాబుకు రూ.16,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కష్టకాలంలో ప్రజలతో కలిసి నిలబడటం పార్టీ ధ్యేయమని తెలిపారు. బాధిత కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  మోకాళ్ళ ఆజాద్, వుకే శ్రావణ్, పూణేం లక్ష్మన్న, వుకే బాబు, వాగబోయిన మోహన్ రావు, పూణేం చలపతిరావు, మోకాళ్ళ పోతయ్య, పూణేం ప్రభాకర్, చిన్న బుచ్చయ్య, ఈసం సమ్మయ్య, వుకే వెంకన్న, అరెం మంగయ్య, వాగబోయిన శ్రీవేణి, పూణేం పుష్పలత, అరెం రాంబాయి, ఈసం సంసారక్క తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పోతిరెడ్డిగూడెం గ్రామ కమిటీ కార్యదర్శి మోకాళ్ళ ఆజాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727