అక్రమ అరెస్టులతో తుడుం దెబ్బ ఉద్యమం ఆగదు: ఈసం సుధాకర్

అక్రమ అరెస్టులతో తుడుం దెబ్బ ఉద్యమం ఆగదు: ఈసం సుధాకర్

మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లాలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ సమావేశం వట్టి వాగు సమ్మక్క తల్లి దేవాలయ సన్నిధిలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు ఈసం సుధాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు డా. మహిపతి అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండించారు.

తెలంగాణలో ఆదివాసీల సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, అరెస్టులతో ఉద్యమాన్ని అణగదొక్కలేమని స్పష్టం చేశారు. ఆదివాసీల రిజర్వేషన్ హక్కులు దెబ్బతింటున్నాయని, వాటిని కాపాడేందుకు తుడుం దెబ్బ పోరాటం చేస్తున్నదని పేర్కొన్నారు. గూడూరు మండలంలో నిర్వహించాల్సిన జిల్లా కమిటీ ఎన్నికలకు వస్తున్న రాష్ట్ర అధ్యక్షుడిని బయ్యారం పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమని విమర్శించారు.

అరుణ్ కుమార్ అరెస్టు చేసినంత మాత్రాన తుడుం దెబ్బ ఉద్యమం ఆగదని, అది మరింత ఉద్ధృతంగా ముందుకు సాగుతుందని ఈసం సుధాకర్ హెచ్చరించారు.

ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన నేతల సమక్షంలో తుడుం దెబ్బ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడు ఈసం సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడిగే నాగేష్, కార్యదర్శి సిద్ధబోయిన సంజీవ్ నాయకత్వంలో కొత్త కమిటీని ప్రకటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727