ఏటూరునాగారంలో బీజేపీ నాయకుల సమావేశం – ఇతర పార్టీలపై తీవ్ర విమర్శలు

స్వతంత్ర భారత్ న్యూస్ – ఏటూరునాగారం

ఏటూరునాగారం, మార్చి 17 (మంగళవారం):
ఏటూరునాగారం మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ గాడిచార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా. జాడి రామరాజు నేత హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మేధావులు, పత్రిక మిత్రులు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ పార్టీలు దేశ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు.

అదేవిధంగా, అధికార కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వందేమాతరం గీతం పాడుతున్న సమయంలో అసెంబ్లీ నుండి బయటకు వెళ్లిన ఎంఐఎం ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలని, తమ సాంస్కృతిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న పార్టీలకు ప్రజలు మద్దతు ఇవ్వకూడదని అన్నారు.

గతంలో దేశం విదేశీ పాలనలోకి వెళ్లడానికి కారణమైన శక్తుల గురించి గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సిపిఎం, సిపిఐ, ఎంఐఎం పార్టీలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ యర్రల ఎల్లయ్య, బీజేపీ ఉపాధ్యక్షులు దుర్గం దుర్గారావు, జనగాం ఆనంద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727