బస్సులు రావాలని ఆర్టీసీ అధికారులను కలిశాం - ఈ బయ్యారం ఉపసర్పంచ్ గంగిరెడ్డి సందీప్ రెడ్డి


ఈ బయ్యారం బస్టాండ్ వరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరామని బయ్యారం ఉపసర్పంచ్ గంగిరెడ్డి సందీప్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించారని త్వరలో ఈ విషయాన్ని మరోసారి ఎమ్మెల్యే దృష్టికి, ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. ప్రజల అవసరార్థం కచ్చితంగా ప్రతి బస్సు ఊర్లోకి వచ్చేలా చూస్తామని తెలియజేశారు.

ఒక బస్సు తప్ప మరో బస్సు రావడం లేదు -తోట చైతన్య 

ఉదయం వచ్చే గుంటూరు బస్సు తప్ప ఇంకో బస్సు 20 సంవత్సరాల నుండి ఇక్కడికి రాలేదని స్థానికులు తోట చైతన్య తెలియజేశారు. పేదలు చిన్న అవసరానికి వెళ్లాలన్నా క్రాస్ రోడ్ వరకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. లక్షల రూపాయల వ్యయంతో ఆర్టీసీ అధికారులు నిర్మాణం బస్టాండ్ చేసిన ఇక్కడికి బస్సులు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. స్థానిక ఆర్టీసీ అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి ఇక్కడికి బస్సులు వచ్చే విధంగా చూసి ప్రజల సమస్యలు లేకుండా చూడాలి. ఉదయం పూట ఎక్కడికి వెళ్లాలన్నా ప్రయాణం చేయాలంటే క్రాస్ రోడ్ లేదా మణుగూరు వెళ్లాల్సి వస్తుంది. బయ్యారం సెంటర్లో బస్సులు తిప్పుకోవడం ఇబ్బందిగా ఉంది. కావున ప్రతి బస్సును బస్టాండ్ వరకు పంపితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.


చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి పేద ప్రజలకు ఉపయోగం : బోడ లక్ష్మణ్ రావు 

ఈ బయ్యారం బస్టాండ్ చుట్టూ పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ పాఠశాలలు, రైతు వేదికలు, అలాగే అనేక గ్రామాలను కలిపే రహదారులు ఉన్నాయి. ఇక్కడకు బస్సులు రావడం వల్ల పేద మహిళలకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. కావున పేద ప్రజల దృష్టిలో ఉంచుకొని ప్రతి బస్సు ఇక్కడికి వచ్చేలా ఆర్టీసీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. గతంలో అనేక సార్లు ఆర్టీసీ అధికారులకు సైతం తెలియజేశాను. ప్రస్తుతం ఈ బస్టాండ్ వరకు డబల్ రోడ్డు సౌకర్యం ఉన్నది. జాతీయస్థాయి కబడ్డీ క్రీడలు సైతం ఈ ప్రాంతంలో జరిగాయంటే ఇక్కడ ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవాలి. జాతీయ క్రీడలు బయ్యారం వస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం నడిపే బస్సులు మాత్రం ఇక్కడికి రావడం లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727