న్యూ డెమోక్రసీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలి

న్యూ డెమోక్రసీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలి
ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల భూదాన భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలలో కొందరికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇవ్వడం, మరికొందరికి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నిర్వహిస్తున్న శాంతియుత బంద్‌లో పాల్గొన్న న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవు నూరి మధు, ఖమ్మం జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, కోల లక్ష్మీనారాయణ తదితర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గుండాల మండలం కాచనపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కాచనపల్లి గ్రామ కార్యదర్శి అటికం శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పూనెం రంగన్న మాట్లాడుతూ, ఫిబ్రవరి 24న ఖమ్మం పట్టణం వెలుగుమట్లలో గత పది సంవత్సరాలుగా నివసిస్తున్న సుమారు 800 మంది పేదల గుడిసెలను ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చివేశారని విమర్శించారు. అనంతరం జరిగిన పోరాటాల ఫలితంగా 300 మందికి మాత్రమే అదే స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం, మిగిలిన వారికి ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు.
ఈ సమస్యపై ఆందోళన చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఖండనీయమని పేర్కొంటూ, అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, వెలుగుమట్ల భూదాన భూముల్లో గుడిసెలు తొలగించిన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎనగంటి చిరంజీవి, ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) జిల్లా నాయకులు ఎనగంటి లాజర్, న్యూ డెమోక్రసీ మండల నాయకులు బొమ్మెర వీరన్న తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727