అస్వస్థతకు గురైన బాలికలను పరామర్శించిన తహసీల్దార్
మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల బాలికలను తహసీల్దార్ అద్దంకి నరేష్ పరామర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అలాగే బాలికలు ధైర్యంగా ఉండాలని తహసీల్దార్ నరేష్ అన్నారు.
Tags
manuguru