అశ్వాపురం సమావేశం వాయిదా – 23కు మార్పు

అశ్వాపురం సమావేశం వాయిదా – 23కు మార్పు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురంలో నిర్వహించాల్సిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 22 (ఆదివారం)న జరగాల్సిన ఈ సమావేశాన్ని 23 (సోమవారం)కు మార్చినట్లు తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్లెం కోటి (నరేందర్) తెలిపారు.
ఏజన్సీ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ చట్టాలను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. అశ్వాపురం మండలంలో అక్రమంగా సాగుతున్న ఇటుక బట్టీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన మర్రి మల్లారెడ్డి ఆదివాసీ చట్టాలను అతిక్రమించి అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం మరియు అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు.
అదేవిధంగా, తుమ్మల చెరువు విషయంలో ఆదివాసీ సమాజానికి కల్పించిన హక్కులను పక్కనబెట్టి వ్యక్తిగత పెత్తనం కొనసాగుతున్నదని విమర్శించారు. 5వ షెడ్యూల్ చట్టాల అమలు, ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో 23న జరగనున్న అశ్వాపురం సమావేశానికి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ నాయకత్వం హాజరుకానుండగా, ఆల్లెం కోటి అధ్యక్షత వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తుడుందెబ్బ పిలుపునిచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727