డ్రోన్ బ్యాటరీ పేలుడు.. రైతుకు రూ.1.10 లక్షల నష్టం

డ్రోన్ బ్యాటరీ పేలుడు.. రైతుకు రూ.1.10 లక్షల నష్టం
📍 గుండాల మండలం, కొమ్ముగూడెం
గుండాల మండలం కొమ్ముగూడెం గ్రామంలో రైతు వాగబోయిన నరసింహారావు ఇంట్లో డ్రోన్ బ్యాటరీ పేలిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, నరసింహారావుతో పాటు మరో ఇద్దరు రైతులు ఎస్‌ఏజీ (SAG) కంపెనీకి చెందిన డ్రోన్‌ను అప్పు తీసుకుని సుమారు రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు.
డ్రోన్‌లో సాంకేతిక సమస్యలు ఉండటంతో బ్యాటరీని వేరుచేసి ఉదయం వరంగల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఉదయం 8:30 గంటల సమయంలో అకస్మాత్తుగా బ్యాటరీ నుంచి మంటలు వచ్చి పెద్ద శబ్దంతో పేలింది. దీంతో సమీపంలో ఉన్న డ్రోన్ చార్జర్‌కు కూడా మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది.
మంటలు ఇంటి తలుపుకు కూడా అంటుకోవడంతో స్థానికులు అప్రమత్తంగా స్పందించి వెంటనే అగ్నిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో బ్యాటరీ (రూ.60,000) మరియు చార్జర్ (రూ.50,000) కలిపి మొత్తం రూ.1,10,000 నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు.
ఈ ప్రమాదంతో నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727