కారేపల్లిలో ఉచిత ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ శిబిరం

కారేపల్లి, ఫిబ్రవరి 18 (స్వతంత్ర భారత్)
కారేపల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 22వ తేదీ (ఆదివారం) ఉచిత ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Mission Walk Foundation మరియు Mission Walk – Neuro Rehab ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుంది. సంస్థ స్థాపకులు, న్యూరో రిహాబిలిటేషన్ నిపుణులు డా. రవి బాదవత్ (15 సంవత్సరాల అనుభవం కలిగిన న్యూరో ఫిజియోథెరపీ నిపుణులు) పర్యవేక్షణలో వైద్య సేవలు అందించనున్నారు.
మొట్టమొదటిసారిగా కారేపల్లిలో రోబోటిక్ సాయంతో చికిత్స సేవలు అందించబడనున్నాయని నిర్వాహకులు తెలిపారు. మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చికిత్స అందించబడే సమస్యలు:
న్యూరో సంబంధిత సమస్యలు:
పక్షవాతం, స్ట్రోక్, వెన్నెముక గాయాలు, తల గాయాలు, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, నరాల బలహీనత, మెదడు శస్త్రచికిత్స అనంతర బలహీనత.
ఆర్థో సమస్యలు:
మోకాలి నొప్పి, ఎముక విరుగుడు తర్వాత బలహీనత, వెన్నునొప్పి/సయాటికా, జాయింట్ రీప్లేస్‌మెంట్ తర్వాత రిహాబిలిటేషన్, భుజం/మెడ నొప్పులు, క్రీడల గాయాలు.
పిల్లల సమస్యలు:
సెరెబ్రల్ పాల్సీ, ఆటిజం, డెవలప్‌మెంట్ డిలే, ఆలస్యంగా నడక/మాట్లాడటం, మసిల్ బలహీనత, జన్యు సమస్యలు, పుట్టుకతో వచ్చిన కాళ్ల వంకరలు.
శిబిరంలో అందించబడే సేవలు:
ఉచిత ఫిజియోథెరపీ పరీక్ష
న్యూరో & ఆర్థో నిపుణుల సలహా
ఆధునిక రోబోటిక్ రిహాబిలిటేషన్ వివరాలు
వ్యక్తిగత చికిత్స మార్గదర్శకాలు
ఇప్పటివరకు సరైన చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్న వారు, నడవాలని ఆశతో ఉన్న వారు, పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.
📍 స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, కారేపల్లి
📅 తేదీ: 22-02-2026 (ఆదివారం)
📞 నమోదు కోసం: 91773 00194
ప్రజలు ఈ సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులు, పొరుగువారికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
Mission Walk – ప్రతి అడుగులో ఆశ, ప్రతి జీవితానికి మార్పు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727