సమ్మక్క–సారలమ్మ జాతరలో భక్తుల వెల్లువ… కుర్నవల్లి పరిధిలో ఆలయం వద్ద పడిగెలు
కరకగూడెం
కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి పంచాయతీ కుర్నవల్లి పరిధిలోని ప్రసిద్ధ సమ్మక్క–సారలమ్మ జాతర ఘనంగా కొనసాగుతోంది.గురువారం వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలు జన సంద్రంలోకి రానున్న తరుణంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది.
జాతరలో భాగంగా సంప్రదాయ ఆచారాల ప్రకారం ఆలయం వద్ద పడిగెలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటూ, తమ కుటుంబాల సంక్షేమం కోసం వన దేవతలను ప్రార్థిస్తున్నారు. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో జాతర ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రమశిక్షణ, భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటూ జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా గ్రామీణ సంప్రదాయాలు, ఆదివాసీ సంస్కృతి మరోసారి ఉట్టిపడుతూ భక్తుల్లో భక్తి భావాన్ని నింపుతున్నాయి.
Tags
కరకగూడెం