కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించాలిసమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి: సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేష్

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 12,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ లకు తెచ్చిన అనుకూల విధానాలనువెంటనేఉపసంహరించుకోవాలని, కార్మిక–కర్షక వర్గాలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూర్పాటి రమేష్ పిలుపునిచ్చారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం అచ్చంపేటలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలోని ప్రైవేటు పటేల్ ఫంక్షన్ హాల్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభను నిర్వహించారు.సభకు ఎం. శంకర్ నాయక్ అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలు వల్ల దేశంలోని సుమారు 40 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ కోడ్‌ల ద్వారా కార్మికుల సంఘటిత హక్కులు, నిరసన హక్కులను పరిమితం చేసే పరిస్థితి ఏర్పడుతుందని విమర్శించారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీసే విధానాలను తిప్పికొట్టే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, నాగరాజు, సీఐటీయూ సహాయ కార్యదర్శి శంకర్ నాయక్, సైదులు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, మంజుల, శాంతమ్మ, సృజన, జయప్రద, భారతి, కార్యదర్శి అలివేల, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సయ్యద్, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ఆర్టీసీ నాయకులు వెంకటయ్య, కేశవులు, చంద్రు, గోపాల్, సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి. రాములు, సీనియర్ నాయకులు శివరాములు, ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత, సైదమ్మ, పద్మ, రజిత, అనూష, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సుల్తాన్, ఏమయ్యా, నిరంజన్, బాలస్వామి, ఇసాక్, ఇజాస్, గణేష్, శీను, అడ్డకూలి సంఘం నాయకులు రాము, వెంకటయ్య, మార్కెట్ హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మయ్య, రేనయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలమ్మ, వెంకటమ్మ, సాయిలు, శీను తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా కార్యకర్తలు, హమాలీలు, ఉపాధి హామీ కార్మికులు, ఐకేపీ సభ్యులు సహా వివిధ రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727