నూతన ఎంపీడీవో ను సన్మానించిన సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు


పినపాక మండలానికి నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన కంటిపూడి వెంకటేశ్వరరావును గురువారం సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీతంపేట గ్రామ సర్పంచ్ శివశంకర్, ఉపసర్పంచ్ ఆరె శ్రవంతి, దుగ్నేపల్లి గ్రామ సర్పంచ్ గుండాపు కిరణ్ కుమార్, ఉపసర్పంచ్ సందీప్ రాజ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పోకల కృష్ణార్జున్, కొండేరు కృష్ణమూర్తి, నవీన్ తదితరులు పాల్గొని నూతన ఎంపీడీవోకు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటిపూడి వెంకటేశ్వరరావు గతంలో నిబద్ధతతో, బాధ్యతాయుతంగా సేవలు అందించారని పేర్కొన్నారు. అలాంటి అనుభవం కలిగిన అధికారి పినపాక మండల ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించడం మండల ప్రజలకు గర్వకారణమని కొనియాడారు. ఆయన నాయకత్వంలో మండల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నూతన ఎంపీడీవో కంటిపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727