పురుగులున్న అన్నం పెడుతున్నారని రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో పురుగులున్న అన్నం వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు బుధవారం ఆందోళన చేపట్టారు.
మెనూ ప్రకారం భోజనం అందించకుండా నాసిరకం ఆహారం పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో మంగళవారం శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.ఆందోళన సమయంలో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న ఎమ్మార్వో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727