ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘లయన్స్ క్లబ్’ అండ....రూ.24 వేల విలువైన బెంచీల వితరణ

దుమ్ముగూడెం, ఫిబ్రవరి 9:
దుమ్ముగూడెం మండలంలోని రామారావుపేట గ్రామం, ఒడ్డు గుంపు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ – డాక్టర్స్ ఫ్యామిలీ సభ్యులు అండగా నిలిచారు.
పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ.24,000 విలువైన బల్లలను (డెస్క్‌లు) సోమవారం వితరణ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు లయన్స్ క్లబ్ తమ వంతు సహకారం అందించింది.
ఈ బల్లల ఏర్పాటు వల్ల విద్యార్థులు నేలపై కూర్చోవాల్సిన అవసరం లేకుండా, సౌకర్యవంతంగా తరగతి గదిలో కూర్చొని పాఠాలు వినే అవకాశం కలిగింది. దీంతో చదువు పట్ల ఆసక్తి మరింత పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.
మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను గుర్తించి, పిల్లల విద్యకు తోడ్పడుతున్న లయన్స్ క్లబ్ సభ్యులను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి భవిష్యత్‌కు బలమైన పునాది వేయవచ్చని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డాక్టర్స్ ఫ్యామిలీ సభ్యులు
కమలా రాజశేఖర్, వనజ మోహనరావు, భారతి నారాయణ్ రావు, పవన్, సిద్ధారెడ్డి, నరసింహ చారి,
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. జ్యోతి, లయన్స్ క్లబ్ బాధ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727