ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం

భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ షేక్ ఖదీర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ హోదాలో గల ఖదీర్ భద్రాచలం ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.
ఖదీర్ గతంలో బూర్గంపాడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసినపుడు అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడు. వివిధ రిజిస్ట్రేషన్ పనులకోసం ఆఫీసుకు వచ్చే క్లయింట్ల నుంచి నేరుగా డబ్బును ఫోన్ పే ద్వారా బదిలీ చేయించుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డాడు. ఏసీబీ అధికారులు నిరుడు జూన్ లో బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంలో ఖదీర్ వసూళ్ల అవినీతి కార్యకలాపాలను గుర్తించారు.

అనంతర దర్యాప్తులో ఖదీర్ బ్యాంకు ఖాతాలను, స్టేట్మెంట్లను, లావాదేవీలను పరిశీలించి అతని అవినీతి కార్యకలాపాలను ధ్రువీకరించుకున్నారు. ఖదీర్ స్వయంగానేగాక, తన కింద పనిచేసే సిబ్బంది ద్వారా కూడా పనుల కోసం రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చే ప్రజల నుంచి ఫోన్ పే ద్వారా వసూళ్లు చేసి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ పరిశీలనలో తేలింది. ఈ పరిణామాల్లో ఖదీర్ ను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ వెల్లడించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727